రాజమండ్రి: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది

60చూసినవారు
రాజమండ్రి: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో నలుగురు మృతి చెందడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్