రాజమండ్రి: 144 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి 144 అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోగా వెంటనే పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు.