రాజమండ్రి: వాహనదారులకు హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, ఫోర్ వీలర్స్ వాహనాల్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలి, తద్వారా సేఫ్టీగా ప్రయాణం చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజమండ్రి టీమ్ తరపున వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆదివారం త్రీటౌన్ పోలీసు స్టేషన్, పుష్కర్ ఘాట్, కోటిపల్లి బస్టాండ్లలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.