ప్రభుత్వ ఆసుపత్రుల పై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే బత్తుల

82చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన వైద్య పరికరాలు, ఆధునీకరణకు నోచుకోని భవనాలు, వైద్యులు కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్