అడ్డతీగల మండల కేంద్రంలోని సెయింట్ మేరిస్ స్కూల్ లో బుధవారం ఘనంగా సైన్స్ ఫెయిర్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంఈఓ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. కాలుష్య నివారణ పద్దతులు, యాసిడ్ రెయిన్, మంకి గన్, హైడ్రో పవర్, పాములను భయపెట్టే యంత్రాలు వంటి విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎపియార్ నుండి వచ్చిన టీచర్లు ప్రాజెక్టులకు మార్కులు వేశారు.