AP: ఇంటర్మీడియట్ విద్యా మండలి శనివారం ఇంటర్ 2025 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన సీ హెచ్. సాత్విక ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 445 మార్కులు సాధించారు. బాలిక రాజమండ్రిలోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు సీత, నాగేశ్వరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలిక తండ్రి నాగేశ్వరావు వృత్తిరీత్యా వ్యాపారం చేస్తుంటారు.