తలుపులమ్మ తల్లికి రూ. 4. 99 లక్షల ఆదాయం

65చూసినవారు
తలుపులమ్మ తల్లికి రూ. 4. 99 లక్షల ఆదాయం
ఆషాడ మాసం మూడో ఆదివారం కావడంతో తుని మండలంలో కొలువైన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తలుపులమ్మ తల్లి భక్తులుకు శాకాంబరిగా దర్శనమిచ్చింది. అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఈ ఒక్క రోజున సుమారు 15, 000 మంది మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానమునకు రూ. 4, 99, 327 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓపి విశ్వనాథరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్