ప్రభుత్వ ఆదేశాల అమలులో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో కృష్ణమోహన్ హెచ్చరించారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలు లేని వారికి పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు తెరిపించాలన్నారు. ఖాతాలు ఉన్నవారికి జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ కు బ్యాంకు ఖాతాలను లింక్ చేయించాలని సూచించారు.