దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా కో-ఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు. అల్లవరం మండలం గోడిలంక భవిత కేంద్రాన్ని శనివారం సందర్శించారు. భవిత కేంద్రానికి వచ్చే దివ్యాంగులను ప్రేమతో సాకాలని, వారికి అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలన్నారు. ప్రతి బుధవారం కేంద్రంలో చేపట్టే ఫిజియోథెరపీ వినియోగించుకునేలా దివ్యాంగుల తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించాలన్నారు.