అల్లవరం: ఓఎన్జీసీ ప్లాంట్ లోకి సముద్రపు నీరు

76చూసినవారు
అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో కెరటాలు తీవ్ర రూపం దాల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. బుధవారం రాత్రి ఇక్కడి వశిష్ట నూతన టెర్మినల్ లోపలికి సముద్రపు నీరు వెళ్లడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఉదయం నుంచి ప్రహరీకి అనుకుని ఉన్న రహదారిని తాకుతున్న అలలు, రాత్రికి మరింత ఉద్ధృతమయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్