అమలాపురం: లోక్ అదాలతో 126 కేసులు పరిష్కారం

56చూసినవారు
అమలాపురం: లోక్ అదాలతో 126 కేసులు పరిష్కారం
అమలాపురం కోర్టుల సముదాయంలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో రూ. 17 కోట్ల 93 లక్షల విలువైన 126 కేసులు పరిష్కారం అయ్యాయి. అమలాపురం జిల్లా రెండో అదనపు కోర్టులో న్యాయమూర్తి వి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్నారు. పరిష్కారమైన 126 కేసుల్లో 56 సివిల్ కేసులు, 23 బ్యాంక్ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసుల 20, తదితర కేసులు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్