వరి సాగులో రైతులందరూ సాగునీటి యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులను పాటించాలని కోనసీమ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసు బాబు సూచించారు. అమలాపురం మండలంలోని సమనస గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద ఆయన అమలాపురం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సస్యరక్షణ పద్ధతులపై వారికి ఆయన శిక్షణ కార్యక్రమం నిర్వహించి వాటిపై అవగాహన కల్పించారు.