అపార్ ఐడి నమోదు విద్యార్థులకు అత్యంత ముఖ్యమని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎక్కడ చదివారో సులభంగా తెలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. సోమవారం అమలాపురం మండలం అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత ఇసుక పాలసీ, ధాన్యం సేకరణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల గురించి చర్చించి సూచనలు చేశారు.