యానాం నుంచి అక్రమ డీజిల్, ఆయిల్ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోనసీమ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సమావేశం డిమాండ్ చేసింది. అమలాపురంలో శనివారం జరిగిన సమావేశంలో యానాం నుంచి విచ్చలవిడిగా డీజిల్, ఆయిల్ రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డీలర్స్ ప్రతినిధులు అనిల్ కుమార్, తాతబాబు డిమాండ్ చేశారు. అక్రమ రవాణాతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.