బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కోనసీమ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి అన్నారు. ఆమె అమలాపురం మండలంలోని కలెక్టరేట్ వద్ద బుధవారం నిర్వహించిన కిశోర వికాసం జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబంలో అందరూ విద్యావంతులు కావడం వలన సామాజికంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.