అమలాపురం: ప్రగతి నారీ సంఘం మండల కమిటీ ఎన్నిక

67చూసినవారు
అమలాపురం: ప్రగతి నారీ సంఘం మండల కమిటీ ఎన్నిక
అమలాపురం మండలం కామనగరువు పంచాయతీ కరక్కాయిపేటలో ప్రగతి నారీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. పద్మావతి అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మండల అధ్యక్షురాలుగా సిహెచ్ విజయలక్ష్మి, కార్యదర్శిగా జె. వెంకటలక్ష్మి, సభ్యులుగా లక్ష్మి, నాగమణి దేవి, విజయలక్ష్మి తదితరులు ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్