ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. ఆయన మంగళవారం అమలాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.