అమలాపురం: బట్నవెల్లిలో త్రాచుపాము హల్ చల్

69చూసినవారు
అమలాపురం మండలం బట్నవిల్లిలో బుధవారం ఓ ఇంట్లో త్రాచుపాము హల్చల్ చేసింది. ఇంటి వద్దకు తాచుపాము రావడంతో నిమ్మితి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు భయపడిపోయారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో ఉన్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి దూర ప్రాంతంలో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్