అమలాపురం పట్టణం ముఖద్వారం ఈదరపల్లిలో వంతెన వద్ద గురువారం మధ్యాహ్నం ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా వాహన చొదకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. అర్ అండ్ బీ అధికారులు స్పందించి వెంటనే రెండో వంతెన ఏర్పాటు నిర్మించి ట్రాఫిక్ కష్టాల నుంచి రక్షించాలని ప్రజలు కోరారు.