ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏ విధమైన అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ సాగించాలని అధికారులకు కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్, జిల్లా అధికారులు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు.