త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభం- ఎమ్మెల్యే

79చూసినవారు
త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభం- ఎమ్మెల్యే
పేద ప్రజల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్న కాంటీన్లు ఏర్పాటుచేస్తుందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం పేర్కొన్నారు. అమలాపురం పట్టణంలో త్వరలో ఏర్పాటుచేయనున్న అన్న క్యాంటీన్ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్