అమలాపురంలో స్వర్ణ వాటర్ ప్లాంట్ వెనుక భాగంలో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా సోమవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దానికి బిల్డింగు కుంగిపోయింది. దీంతో పలువురు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అమలాపురం పట్టణ సీఐ వీరబాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు అడిగారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.