డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ శివారు రావులచెరువు పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రి, కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆయన సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాద పూర్వాపరాలపై విచారణ జరుగుతుందన్నారు.