సిలిండర్ పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించిన మంత్రి

85చూసినవారు
అమలాపురంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో బాణాసంచా నిల్వ ఉంచిన ఇంటిలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటన జరగడానికి గల కారణాలను ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్