ఖరీఫ్ పంటలో ధాన్యాన్ని రైతులకు నచ్చిన రైసుమిల్లుకు అమ్ముకునే వెసలుబాటు కల్పించామని ఎమ్మార్వో వెంకటేశ్వరి తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. మండలంలో 7, 411 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇంత వరకు 48 మెట్రిక్ టన్నులు విక్రయించారన్నారు. చిరుతపూడితో పాటు 4 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.