అయినవిల్లి మండలం అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 3,51,915 ఆదాయం వచ్చిందని ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. 606 మంది ప్రత్యేక దర్శనం ద్వారా భక్తుల స్వామిని దర్శించుకున్నారు. 2680 మంది భక్తులు నిత్య అన్నదాన పథకం ద్వారా అన్న ప్రసాదాలను స్వీకరించారని ఈవో వెల్లడించారు.