మామిడికుదురు మండలం అప్పనపల్లిలో బ్రాందీ షాపుకు మంగళవారం తాళం వేశారు. శ్రీబాల బాలాజీ స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రధాన రోడ్డు పక్కన బ్రాందీ షాపు ఇబ్బందికరంగా మారిందంటూ ఆలయ ఈవో సత్యనారాయణ రాజు రాసిన లేఖపై అధికారులు స్పందించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. షాపును మూసేయాలని ఆయన ఆదేశించడంతో అప్పనపల్లిలో ఏర్పాటు చేసిన బ్రాందీ షాపుకు మంగళవారం తాళాలు వేశారు.