మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన పీవీ సత్య నారాయణ రాజు ఇటీవల జరిగిన వేలంలో ముంబై ఐపీఎల్ జట్టు టీం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన క్షత్రియ కార్తీక వన సమారాధనలో కేక్ కట్ చేసి విజయోత్సవం నిర్వహించారు. ముంబై జట్టుకు ఆల్ ద బెస్ట్ అంటూ నినాదాలు చేశారు. సత్యనారాయణ రాజు ముంబై జట్టుకు ఎన్నో విజయాలు అందించాలని అభిలాషించారు. మహిళలు సైతం కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.