మామిడికుదురు మండలం మామిడికుదురులో శుక్రవారం అడబాల శేష కుమారి మెడలోని ఆరు కాసుల బంగారం గొలుసు గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారు. ఆమె కేకలు వేయడంతో కిందకి తోసేసి గోడ దూకి పారిపోయాడు. ఈ పెనుగులాటలో దొంగకు చెందిన సెల్ ఫోన్ కింద పడిపోయింది. నగరం ఎస్సై చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు చోరీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.