మామిడికుదురు మండలం నగరం గ్రామంలో అనధికారికంగా నిల్వ చేసిన బాణాసంచాను నగరం ఎస్ఐ చైతన్య కుమార్ మంగళవారం తెలిపారు. ఈదరాడ కాలువ గట్టు రోడ్డులో మోహన్ సతీష్ రూ. 35 వేల విలువైన బాణాసంచాను అనధికారికంగా నిల్వ చేశాడన్నారు. స్థానికుల ఫిర్యాదుపై దాడి చేసి బాణాసంచాను సీజ్ చేశామన్నారు. అనధికారికంగా బాణాసంచా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.