గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పి. గన్నవరం మండలంలోని జి. పెదపూడి గ్రామానికి చెందిన మంతెన రవిరాజు పోటీ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలపై తాను పోరాడతానని, తను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులకు, పట్టభద్రులకు న్యాయం చేస్తానని ఆయన తెలిపారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు.