కరోనా నేపథ్యంలో మూడు నెలల వరకు విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్న వదంతులు వినియోగదారులు నమ్మవద్దని జగ్గంపేట ఎలక్ట్రికల్ డీఈ వై డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బిల్లులను ఆన్ లైన్ ద్వారా సకాలంలో చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలని కోరారు. బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు పలు యాప్ లు ఉపయోగించి బిల్లులు చెల్లించి కోవచ్చునని తెలిపారు. ఈస్ట్రన్ పవర్ యాప్, బిల్ డెస్క్, పేటీఎం, యూపీఐ యాప్, ఈజీ పే, ఐసీఐసీఐ యాప్ అమెజాన్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, జియో మనీ, ఫ్రీ ఛార్జ్ తదితర యాప్ లను బిల్లులు చెల్లించేందుకు ఉపయోగించవచ్చునని డీఈ తెలిపారు.