గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఎస్ఐ శివ నాగబాబుకు వచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 4200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మీడియాకు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు. ఎవరైనా పేకాట, కోడిపందేలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.