జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. విశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ పెద్దలు కంబాల శ్రీనివాసరావును సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమానికి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.