విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఆటోల్లో పరిమితికి మించి అనుమతించవద్దని సీఐ వైఆర్కే. శ్రీనివాస్ సూచించారు. గండేపల్లి మండలం సుబ్బయమ్మపేటలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులను తెరవొద్దని కోరారు. విలువైన వస్తువులు, నగదు, అభరణాలు ఇంట్లో ఉంచి ఊర్లకు వెళ్లరాదని, అపరిచిత వ్యక్తుల సంచారంపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.