ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్చ దివాస్ జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని స్థానిక ఎంపీడీఓ చంద్ర శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 18న శనివారం నుంచి ప్రారంభించి డిసెంబర్ 2025 మూడో శనివారం వరకు నిర్వహిస్తారన్నారు.