జగ్గంపేట సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం

62చూసినవారు
జగ్గంపేట సీఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం
జగ్గంపేట నూతన సీఐగా ఆదివారం వైఆర్కె శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన జగ్గంపేట పోలీసు స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, జగ్గంపేట ఎస్ఐ రఘునాధరావు, కిర్లంపూడి ఎస్ఐలు, సర్కిల్ సిబ్బంది సీఐ శ్రీనివాస్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని శాంతిభద్రతలను కాపాడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్