భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన 75వ వార్షికోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రాజ్యాంగానికి ఆమోదించి 75ఏళ్లు సందర్భంగా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు.