వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి, ఉత్పాదక వ్యయం, ఇన్ ఫుట్ ధరల పెరుగుదల వంటి అంశాల ఆధారంగా 2025-26 సంవత్సరానికి రైతులకు అందించే రుణ పరిమితులను ప్రతిపాదించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులకు సూచించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.