ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మెడ్లే సంజీవి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి సేవలు అందించడం జరుగుతుందన్నారు.