కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం ఇరు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు, హెలీకాఫ్టర్లు సముద్రతీరంలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు నిర్వహించాయి. లంగరువేసిన యుద్ధ నౌకల ద్వారా మెకనైజ్డ్ లాంగ్ క్రాఫ్ట్‌లు, స్పీడ్, జెమినీ బోట్లలో సైనికులు తీరానికి చేరుకుని విన్యాసాలు సాగించారు.