కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాలుకా కొండాపురం, తొండంగి మండలంలోని ఏవీ నగరంలో, ప్రియుడితో కలిసి భార్య తన భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.