కరప: కోడిపందేల బరులపై పోలీసుల దాడులు

58చూసినవారు
కరప మండల పోలీసులు శనివారం కోడి పందేలకు ఏర్పాటు చేసిన బరులు ధ్వంసం చేశారు. మండలంలోని కొరుపల్లి, గొర్రిపూడి, గురజనాపల్లి గ్రామాల్లో కోడి పందేలకు బరులు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుకున్నారు. వెంటనే ఎస్సై సునీత అధ్వర్యంలో ఏఎస్సై కలిసి బరులను ధ్వంసం చేశారు. కోడి పందేలు నిషేధమని హైకోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తూ కేసులు పెడతామని ఎస్సై హెచ్చరించారు. తహశీల్దార్ నందిపాటి సత్యనారాయణ పర్యవేక్షణ చేశారు.

సంబంధిత పోస్ట్