ఇండిపెండెంట్ గా ఐఈ కుమార్ నామినేషన్

53చూసినవారు
ఇండిపెండెంట్ గా ఐఈ కుమార్ నామినేషన్
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన విశ్రాంత ఎంపీడీవో, సామాజికవేత్త ఇసుక పట్ల ఇమ్మానుయేల్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జి వి సత్యనారాయణ కు అందజేశారు. అన్నా మినిస్ట్రీస్ సంస్థ ద్వారా ఎన్నో లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలను కుమార్ నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కుమార్ పేరు తెలియని వారు ఉండరు.

సంబంధిత పోస్ట్