వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు రూ. 12, 94, 4 35 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంఠం శెట్టి శ్రీనివాసరావు, కరుటూరి నరసింహారావు, మర్ల గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.