దీపావళి పండుగ సందర్భంగా అనధికార బాణాసంచా నిల్వలు లేకుండా చూడాలని కొత్తపేట ఆర్డిఓ శ్రీకర్ అధికారులకు సూచించారు. కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అగ్నిమాపక అధికార్లు, లేబర్ డిపార్ట్మెంట్ అధికార్లతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాత్కాలికంగా బాణసంచా దుకాణాదారులు తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలన్నారు.