ప్రజారోగ్య పరిరక్షకులు.... పారిశుద్ధ్య కార్మికులు

79చూసినవారు
ప్రజారోగ్య పరిరక్షకులు.... పారిశుద్ధ్య కార్మికులు
ప్రజారోగ్య పరిరక్షణలో పరోక్షంగా పారిశుద్ధ్య కార్మికులు అందించే సేవలు ఎనలేనివని కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుంచే పెద్దిరాజు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వికెవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కొత్తపేటకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను దుస్సాలువా పూలమాలల తో ఘనంగా సత్క రించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్