ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసే పాత్రికేయులను ప్రభుత్వాలు తగిన రీతిలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో- కన్వీనర్ గండ్రోతు వీరగోవిందరావు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని, సమాజంలోని లోటు పాట్లను వెలుగులోకి తెచ్చే పాత్రికేయులను పట్టించు కోకపోవడం దురదృష్టకరమన్నారు.