కొవ్వూరు మండలంలోని వేములూరు గ్రామంలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవ్వూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ సూరపనేని చిన్ని పాల్గొన్నారు.