ద్వారపూడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థ కావడి, తీర్థ బిందె మహోత్సవం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంతానం లేని భక్తులు ఈ సంవత్సరం బిందెను ఎత్తుకుంటే వచ్చే సంవత్సరం బిడ్డను ఎత్తుకుంటారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాదే గురుస్వామి ఆధ్వర్యంలో మాల వేసుకున్న భక్తులతో పాటు మహిళలు తీర్థ బిందెలు ఎత్తుకొని నదీ జలాలను తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నదీ జలాలను అభిషేకించారు.